పాత పథకాలకే కొత్త పేర్లతో బ్రాండింగ్ !

పాత పథకాలకే కొత్త పేర్లతో బ్రాండింగ్ !

వైసీపీ హయాంలో పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి బ్రాండింగ్ చేసుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో ఉన్న పథకాలను.. పూర్తిగా కొత్తవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వదలడం లేదని ఆరోపించిన ధూళిపాళ్ల. రైతులు, డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. 

మద్యపాన నియంత్రణ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. క్వాలిటీ లేని బ్రాండ్లు అమ్ముతూ.. పేదల రక్తం తాగుతున్నారని ధూళిపాళ్ల నేరంద్ర ఆరోపించారు. ఏపీలో మద్యం వినియోగం తగ్గినా.. ఆదాయం మాత్రం రూపాయి కూడా తగ్గలేదని ఆయన చెప్పారు. అసలు ఆదాయం ఎంతొస్తుందో ప్రభుత్వ వెబ్ సైట్లలో ఎందుకు పెట్టడం లేదని ధూళిపాళ్ల ప్రశ్నించారు.