నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు :దియా మీర్జా

నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు :దియా మీర్జా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం భయటపడటంతో పరిశ్రమలో కలకలం రేగింది. ఇప్పటికే రియా కాంటాక్ట్ లో పలువురి పేర్లు ఉన్నట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ తారల పేర్లు భయటకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి, నిర్మాత దియా మీర్జా పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను దియా ఖండించింది. తాను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన కెరీర్ కు భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఈ మేరకు దియా ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా గత ఏడాది దియా మేనేజట్ ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు అంటూ వార్తలు వచ్చాయి. అంతే కాకుండా డ్రగ్స్ అమ్ముతున్న ముఠా సభ్యులు అంకుష్, అనుజ్ కేశ్వని విచారణలో దియా పేరును ఎన్సీబీ అధికారులకు చెప్పినట్టు సమాచారం.