ఆర్ఆర్ఆర్ కథ గురించి రచయిత ఏమన్నారంటే.. 

ఆర్ఆర్ఆర్ కథ గురించి రచయిత ఏమన్నారంటే.. 

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్నది.  సినిమాపై భారీ నమ్మకం ఉంది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  చారిత్రాత్మక అంశతో కూడిన కథ అయినప్పటికీ... కల్పితాన్ని జోడించి ఫిక్షన్ సినిమాగా తీస్తున్నారు రాజమౌళి.  

ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు.  రాజమౌళి సినిమాకు డైలాగులు రాయడం అంటే మామలు విషయం కాదు.  చాలా కష్టం అని అనుకుంటారు.  కానీ, రాజమౌళి సినిమాలకు డైలాగులు రాయడం చాలా ఈజీ అని, రాజమౌళి మనసును అర్ధం చేసుకుంటే చాలు.. డైలాగులు రాయడం చాలా ఈజీ అవుతుందని సాయి మాధవ్ పేర్కొన్నారు.  ఏ సీన్‌లో ఎంత డైలాగ్‌ ఉండాలో రాజమౌళికి బాగా తెలుసు. ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఆయన ఆత్మను పట్టుకోగలిగితే చాలు.  సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నా, కథను బట్టే వాళ్లకు డైలాగ్‌లు ఉన్నాయి. కథలో ఆ బ్యాలెన్స్‌ ఉంది. సగం పని రాజమౌళిగారే పూర్తి చేస్తారు.