బొగ్గుగనిలో బయటపడ్డ వజ్రాలు... ఎగబడుతున్న జనం... షాకైన ప్రభుత్వం 

బొగ్గుగనిలో బయటపడ్డ వజ్రాలు... ఎగబడుతున్న జనం... షాకైన ప్రభుత్వం 

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో నాణ్యమైన బొగ్గుగనుల అపారంగా ఉన్నాయి.  అయితే, బొగ్గుగనుల్లో తవ్వకాలు జరుపుతుండగా వజ్రాలు బయటపడ్డాయని వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా ప్రజలు ఆ బొగ్గుగనుల వద్దకు వెళ్లి వజ్రాలను వెతకడం మొదలుపెట్టారు.  మోన్ జిల్లా శివారు ప్రాంతంలోని వాంచింగ్ వద్ద ఉన్న బొగ్గుగనిలో ఈనెల 25 వ తేదీన ఓ వ్యక్తికీ మెరుస్తూ ఉన్న రాళ్ళూ దొరికాయి.   అవి వజ్రాలకు మాదిరిగా ఉండటంతో వార్త బయటకు వచ్చింది.  దీంతో ఎక్కడెక్కడినుంచో వచ్చి వాంచింగ్ గ్రామంలో తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు.  దీంతో ప్రభుత్వం అప్రమతం అయ్యింది.  నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం అధికారులను ఆదేశించింది.  మెరుస్తూ కనిపిస్తున్న రాళ్లు వజ్రాల లేదంటే క్వార్ట్రజ్ శిలలా అన్నది సందేహంగా మారింది.  అయితే, నాగాలాండ్ లోని బొగ్గు గనుల్లో వజ్రాలు బయటపడే అవకాశం ఉందని భూగర్భగని శాస్త్రవేత్తలు కూడా దృవీకరించడంతో ఒక్కసారిగా నాగాలాండ్ లోని వాంచింగ్ గ్రామం వెలుగులోకి వచ్చింది.