చిరంజీవికి ఏమైంది.. మారారా.. మార్చేశారా?

చిరంజీవికి ఏమైంది.. మారారా.. మార్చేశారా?


చిరంజీవిని మార్చేశారా.. లేక మారిపోతున్నాడా.. పాత లెక్కల్లోనే ఉంటే ప్రాబ్లమ్‌ అనుకుంటున్నాడా. అందుకే రెగ్యులర్‌ మెగా ఈక్వేషన్స్‌ని పక్కనపెట్టి సెపరేట్‌ ట్రాక్‌లోకి వస్తున్నాడా అన్న ప్రశ్నలు చిరు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. మరి సిక్స్టీ ప్లస్‌లోనూ బాక్సాఫీస్‌ని గ్రిప్‌లో పెట్టుకున్న చిరంజీవిలో సడన్‌ ఛేంజెస్‌కి కారణమేంటి? చర్చ చేస్తున్నారు. అయితే చిరంజీవి కమర్షియల్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాడు. కామెడీ, యాక్షన్, సాంగ్స్, అన్నీ ఉండేలా చూసుకుంటాడు. రీఎంట్రీలో తమిళ హిట్‌ 'కత్తి'ని 'ఖైదీ నం.150'గా రీమేక్ చేస్తున్నప్పుడు కూడా ఒరిజినల్‌ ట్రాక్స్‌కి ఎక్స్‌ట్రా కమర్షియల్ ఎలిమెంట్స్‌ యాడ్ చేశాడు. ఒక ఐటెం సాంగ్‌ని కూడా పెట్టించాడు. కానీ ఇప్పుడు 'లూసిఫర్' రీమేక్‌కి ఇలాంటి ఎక్స్‌ట్రాస్‌ లేవని తెలుస్తోంది. తమిళ డైరెక్టర్‌ మోహన్‌రాజా దర్శకత్వంలో మళయాళం సినిమా 'లూసిఫర్‌'ని చిరంజీవి రీమేక్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్‌లో మోహన్‌లాల్‌కి హీరోయిన్‌ ఉండదు. ఇప్పుడు రీమేక్‌లో కూడా చిరుకి హీరోయిన్‌ ఉండదట. మరి చిరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేక్షకుల్లో వస్తోన్న మార్పులే కారణమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటి ప్రేక్షకులు కటౌట్‌ కంటే కంటెంట్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారనీ, అందుకే చిరు కూడా ప్రయోగం చేస్తున్నాడని టాక్ వస్తోంది. చిరంజీవి డైరెక్టర్ల విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తున్నాడు.
 

సక్సెస్‌ డైరెక్టర్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే చిరు ఇప్పుడు ఫ్లాప్‌ మేకర్స్‌తోనూ సినిమాలు చేసేందుకు సిద్దపడుతున్నాడు. మెహర్‌ రమేశ్‌తో 'వేదళం' రీమేక్, అలాగే స్టార్స్ తో పనిచేసినా బ్లాక్‌బస్టర్‌లేని బాబీకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చిరంజీవి తీరుకు అద్దం పడుతోంది. రెగ్యులర్‌ ఫార్మాట్స్‌ని పక్కనపెట్టేస్తూ, ఆల్‌ మిక్సింగ్‌ ఫార్ములాస్‌కి దూరంగా చిరు సినిమాలు ఉంటున్నాయి. అంతేకాకుండా ఫ్లాప్ డైరెక్టర్లకీ అవకాశాలు ఇస్తోన్నాడు. హీరోయిన్‌ లేకుండానే చిరంజీవి 'లూసిఫర్' సినిమా తీసేందుక ఓకే చెప్పాడు. చిరు తన కంబాక్ సినిమా 'ఖైదీ నం.150'ని కంప్లీట్‌ కమర్షియల్‌ మూవీగా మార్చడంతో పాటుగా, ఆ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌‌ను కూడా పెట్టించాడు.'కత్తి' రీమేక్‌గా వచ్చిన ఖైదీ 150 రూపొందింది. కత్తి ఒరిజినల్‌లో ఎటువంటి ఐటెమ్‌ సాంగ్స్ లేదు. కానీ సినిమాను కమర్షియల్‌గా తీర్చి దిద్దేందుకు దాని పెట్టించాడు. అయితే ఇప్పటి ప్రేక్షకులకు తగ్గట్టుగా తాను మారాడాని, ప్రస్తుత ప్రేక్షకులు కటౌట్‌ కంటే కంటెంట్‌కి ప్రియారిటీ ఇస్తోన్నారని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు.