మోడీ - శరద్ పవార్ ల మధ్య ఇదే జరిగిందా? 

మోడీ - శరద్ పవార్ ల మధ్య ఇదే జరిగిందా? 

శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ప్రధాని మోడీ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ తరువాత శరద్ పవార్ మోడీని పర్సనల్ గా కలవడంతో ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు.  మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ఉన్న శివసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  

కాగా, శరద్ పవార్ మోడీ ల మధ్య ఆరోజు సమావేశంలో ఏం జరిగింది అనే విషయాలను శరద్ పవార్ బయటపెట్టారు.  ఇద్దరం కలిసి పనిచేయాలని మోడీ సూచించారని, పర్సనల్ గా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కలిసి పనిచేయలేమని చెప్పానని శరద్ పవార్ పేర్కొన్నారు.  రాష్ట్రపతి పదవి అఫర్ ఇచ్చినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తన కూతురు సుప్రియ సూలేకు కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని కోరినట్టుగా శరద్ పవార్ తెలిపారు.  అదేంటి కలిసి పనిచేయలేము అని చెప్పినపుడు సుప్రియ సూలేకు కేంద్ర మంత్రి పదవి ఎలా ఇస్తారు.