ఈ ఆటగాడి క్రీడాస్ఫూర్తికి అందరూ ఫిదా...

ఈ ఆటగాడి క్రీడాస్ఫూర్తికి అందరూ ఫిదా...

క్రీడలో గెలుపోటములు సహజం. అయితే అందులో విజయం సాధించిన వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో ఓడిపోయిన ఆటగాళ్లకు కూడా అవి లభిస్తుంటాయి. ఇప్పుడు అలాంటిఘటనే ఒకటి స్పెయిన్ లో జరిగింది. అక్కడ ఓ అథ్లెట్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ మధ్యే స్పెయిన్ లోని బార్సిలోనాలో ట్రైత్లన్ నిర్వహించారు. అందులో స్పెయిన్ కు చెందిన అథ్లెట్ డియాగో మెట్రిగో రేస్ ఫినిష్ లైన్ వరకు పరుగుతీసి దానిని దాటకుండా ఆగిపోయాడు. అతను ఆ ఫినిష్ లైన్ దాటిఉంటె మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించేవాడు. కానీ అతను అక్కడే తన క్రీడాస్ఫూర్తి ని చూపించాడు. ఈ రేస్ లో తనకంటే ముందు పరిగెడుతున్న బ్రిటిష్ అథ్లెట్ జేమ్స్ టియాగిల్ చివరి నిమిషంలో ట్రాక్ తప్పడం గమనించిన మెట్రిగో ఫినిష్ లైన్ క్రాస్ చేయకుండా అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత తనకంటే ముందు పరిగెత్తిన జేమ్స్ నే ముందుగా విన్నింగ్ లైన్ దాటేలా చేసాడు. దాంతో జేమ్స్ మెట్రిగో కు ధన్యవాదాలు తెలిపి రేస్ ముంగిచాడు. అయితే డియాగో మెట్రిగో అక్కడ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోసిల్ మీడియాలో వైరల్ గా మారింది.