రికార్డు స్థాయికి పెరిగిన డీజిల్ ధర

రికార్డు స్థాయికి పెరిగిన డీజిల్ ధర

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు రికార్డు స్ధాయిలో పెరిగాయి. దీంతో ప్రస్తుతం లీటర్ డిజిల్ ధర రూ. 69.46, లీటర్ పెట్రోల్ ధర రూ. 78 కి చేరింది. ఈ రోజు మొత్తంగా డీజిల్ 14 పైసలు, పెట్రోల్ 13 పైసలు పెరిగాయి. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన కార‌ణంగానే దేశంలో చ‌మురు కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచాయి. దేశరాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ. 69.46, ముంబయిలో రూ. 73.74 కు చేరుకుంది.

దేశంలోని మెట్రోనగరాలు, రాష్ట్ర రాజధానుల్లో కంటే ఢిల్లీలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అమ్మకపు పన్ను, వ్యాట్ తక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోవడంతో ఆగస్టు 16 నుంచి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.77.91, ముంబయిలో రూ.85.33 గా ఉంది. అయితే మే 29 వ తేదిన మాత్రం అత్యధిక ధరపెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 78.43, ముంబయిలో రూ. 86.24 కు చేరింది. ముంబ‌యి, చెన్నై, బెంగుళూరు న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర రూ.80కి పైనే ఉంది. హైద‌రాబాద్‌లో చాలా రోజుల నుంచి రూ.80 పై నుంచి పెట్రోల్ ధ‌ర దిగిరావ‌డం లేదు.