డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సౌత్‌పై గురి పెట్టేసింది..!

డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సౌత్‌పై గురి పెట్టేసింది..!

కాలం మారుతోంది.. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతోంది.. క్రమంగా డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపు వెళ్తున్నారు. దీంతో.. మరోసారి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ వైపు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లీష్‌ వెబ్‌ సీరిస్‌లు, హిందీ వెబ్‌సిరీస్‌లు ఆకట్టుకోగా.. సౌత్ ఇండియాలో, తెలుగులో వచ్చిన సిరీస్‌లో అంతగా ఆదరణకు నోచుకోలేదు.. ఇది ఒక్కప్పటి మాట.. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు రూటు మారింది.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ వినియోగం గత రెండేళ్లలో విపరీతంగా పెరిగిపోతోందట. ఈ మధ్య అమెజాన్‌లో ప్రైమ్‌మెంబర్స్‌గా చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోందట.. దీంతో.. ఒక్కసారి అమెజాన్‌ ప్రైమ్‌లోకి వెళితే అందులో వేలాది సినిమాలు అందుబాటులో ఉండడంతో ఇక.. ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట నెటిజన్లు.. అమెజాన్‌ లాగే.. బోలెడన్ని డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ వచ్చేస్తున్నాయి. సన్‌నెట్‌ వర్క్‌, జీ నెట్‌వర్క్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇలా దిగ్గజాలు కూడా డిజిటల్ స్రీమింగ్‌ యాప్‌లో వస్తున్నాయి. ఇదే సమయంలో.. సౌతిండియాలో తమ నెట్‌వర్క్‌ను పెంపొందించుకోవడానికి సదరు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా సౌత్‌లో వెబ్‌ సీరిస్‌లను ప్లాన్‌ చేస్తున్నాయి. కొందరు ప్రముఖ దర్శకులతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌. 

డిజిటిల్ స్ట్రీమింగ్ యాప్స్ ప్రముఖ దర్శకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయట.. తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, తెలుగులో సంకల్ప్‌ రెడ్డి ఉన్నారట. వీరితో కొన్ని రీమేక్‌ వెబ్‌ సీరిస్‌లు రన్‌ చేయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా హిందీలో ఆదరణ పొందిన వెబ్‌ సీరిస్‌లను రీమేక్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. హిందీలో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ వెబ్‌ సీరిస్‌లు తెలుగులోనూ ఆకట్టుకుంటాయనే నమ్మకంతో వాటి రీమేక్‌లకు కసరత్తు చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా తర్వాత వెబ్‌ సీరిస్‌లదే హవా అనే లెక్కలు వేస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కొన్ని ప్రయత్నాలు ఇప్పటికే చేశారు. ఫ్యాక్షనిజం మీద ఏదో వెబ్‌ సీరిస్‌ చేసి మధ్యలోనే వదిలేశాడు.. అయితే, ఇప్పుడు అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి రంగంలోకి దిగితే దర్శకులకు కూడా ధీమా కలగడం ఖాయమంటున్నారు. ఆరంభంలో నష్టాలను వచ్చినా తట్టుకొని నిలబడగల శక్తి వాటికి ఉండడంతో.. దీంతో దర్శకులపై అంత ఒత్తిడి ఉండదు. ఇక భవిష్యత్తులో జనాలకు థియేటర్లకు వెళ్లేంత ఓపిక ఉండదని పూరీ జగన్నాథ్‌ కూడా గతంలోనే పేర్కొన్నాడు. దీంతో రానున్న రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌దే హవా అంటున్నారు.