రామాలయానికి కాంగ్రెస్ ఆఫీస్ స్థలం..!

రామాలయానికి కాంగ్రెస్ ఆఫీస్ స్థలం..!

అయోధ్యలో రామాలయం వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుంది. రామాలయం కట్టి తీరాలనే సంకల్పంతో బీజేపీ ఉంది.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రామ మందిరం విషయంలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు రామాలయం ట్రస్టుకు కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయం (డీసీసీ) భూమిని ఇస్తామని ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. తమ హయాంలోనే రామాలయానికి భూమి ఇవ్వడం జరిగిందని, డీసీసీ కార్యాలయానికి కూడా అప్పట్లో భూమి కేటాయించామని..  ఇప్పుడు రామాలయం ట్రస్టుకే డీసీసీ భూమిని కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు దిగ్విజయ్. అయోధ్యలో రామాలయంపై అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు దిగ్విజయ్ సింగ్.