ఆమె గురించి నేను ఏమీ మాట్లాడను-దిగ్విజయ్

ఆమె గురించి నేను ఏమీ మాట్లాడను-దిగ్విజయ్

భోపాల్ పార్లమెంట్ స్థానం నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్‌ బరిలోకి దిగుతోంది. ఆమె.. ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కకేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు దిగ్విజయ్ సింగ్... సాధ్వీ ప్రగ్యా చేసిన కామెంట్లపై స్పందించాల్సిందింగా మీడియా దిగ్విజయ్‌ని కోరగా... ప్రత్యర్థులను నేను ఎప్పుడూ విమర్శించను. ఆమె గురించి నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు' అని ఒకేమాటలో తేల్చారు. అయితే, ఆర్మీ గురించి, అమరవీరుల గురించి మాట్లాడొద్దని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసిన దిగ్విజయ్.. హేమంత్ కర్కరే నిజాయితీ కలిగిన అధికారి, ఉగ్రదాడిలో ముంబై ప్రజల కోసం ఆయన అమరవీరుడయ్యాడని గుర్తుచేశారు.