'శ్రీనివాస కళ్యాణం' అనుకున్నట్లుగా రాలేదా?

'శ్రీనివాస కళ్యాణం' అనుకున్నట్లుగా రాలేదా?

తన బ్యానర్ లో 'శతమానంభవతి' వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు సతీష్ వేగ్నేసకు మరో అవకాశం ఇచ్చాడు దిల్ రాజు. నితిన్ హీరోగా 'శ్రీనివాస కళ్యాణం' అనే సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ కూడా తొందరగానే పూర్తి చేసేలా ఉన్నారు. అయితే ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమా అవుట్ పుట్ పై దిల్ రాజు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నిర్మాతగా తన సినిమాల విషయంలో దిల్ రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తనకు తృప్తిగా అనిపించిన తరువాతే సినిమా 
రిలీజ్ చేస్తాడు. 
రీషూట్స్ చేయడానికి కూడా వెనుకాడడు. శతమానంభవతి సినిమా కోసం ఏకంగా అవుట్ డోర్ షూటింగ్ మొత్తం తనే దగ్గరుండి చూసుకున్నారు. ఆ సమయంలో దిల్ రాజే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడా అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు 'శ్రీనివాసకళ్యాణం' సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశాడట. మేకింగ్ పరంగా కొన్ని తప్పులు దొర్లాయని ఇప్పుడు దాన్ని సవరించే పనిలో పడ్డట్లు సమాచారం. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నందితా శ్వేతా మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.