ఐటీ సోదాలను లైట్ తీసుకున్న దిల్ రాజు

ఐటీ సోదాలను లైట్ తీసుకున్న దిల్ రాజు

 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కార్యాలయంపై కొద్దిసేపటి క్రితమే ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.  ఈ సోదాలు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మహర్షి సినిమా బడ్జెట్‌, బిజినెస్‌ వంటి వివరాలపై ఆరా తీయడానికేనని తెలుస్తోంది.  దిల్ రాజు కూడా పెద్ద సినిమా విడుదలవుతున్నప్పుడు ఇలాంటి రైడ్స్ కామన్ అని, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'మహర్షి' రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది.