దిల్ రాజు చేతిలో సాక్ష్యం 

దిల్ రాజు చేతిలో సాక్ష్యం 

తెలుగు యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న చిత్రం "సాక్ష్యం". శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం   యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. కానీ ఆ రైట్స్ ఎంత మొత్తం అన్నది మాత్రం తెలియదు. 

ఈ సినిమా కర్మ సాక్ష్యం అనే పాయింట్ నుండి ప్రకృతి, పంచభూతాలు నేపథ్యంలో సాగనుంది. టీజర్ లో దీనిపై చూపించిన విజువల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సౌందర్య లహరి పాటను రిలీజ్ చేయగా శ్రోతలను బాగానే ఆకట్టుకుంది. జగపతి బాబు, మీనా, శరత్ కుమార్ లు కీలక పాత్రలో నటించారు. అతుర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫీని అందించగా, హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మించారు.