దిల్ రాజు ఫోకస్ 'ఐకాన్' మీదే అట!

దిల్ రాజు ఫోకస్ 'ఐకాన్' మీదే అట!

తమ తదుపరి చిత్రంగా మొదలయ్యేది 'ఐకాన్' అని స్పష్టం చేశాడు దిల్ రాజు. 'వకీల్ సాబ్' సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెబుతూ 'వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా రెడీ చేశాం. ఇక మొదలు పెట్టడమే తరువాయి' అంటున్నారు. అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని ఇప్పుడు ఇక ఆగేది లేదంటున్నారు. 'వకీల్ సాబ్' ప్రచారంలో అటు దర్శకుడు, ఇటు నిర్మాతకు తప్పక ఎదురైన ప్రశ్న 'ఐకాన్' గురించే కావటం విశేషం. రిలీజ్ కి ముందు 'నో ఐడియా' అని చెప్పినా... 'వకీల్ సాబ్' రిలీజ్ తర్వాత మాత్రం లెక్కలు మారి 'ఐకాన్' రెడీ అంటున్నారు. ఇక బన్నీ కూడా 'పుష్ప' తర్వాత వేరే ఏ దర్శకుడుని లాక్ చేయక పోవడంతో 'ఐకాన్' పట్టాలెక్కడం ఖాయం అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో!?