బన్నీ నో చెప్పిన సినిమాకు చరణ్ ఓకే చెప్తాడా..?

బన్నీ నో చెప్పిన సినిమాకు చరణ్ ఓకే చెప్తాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ వస్తుంది. మొత్తం నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. బన్నీ పుష్ప తర్వాత 21 వ సినిమా డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నట్లు తెలిపాడు.అయితే కొరటాల సినిమా అంటేనే సోషల్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది అని తెలుస్తుంది. అసలు బన్నీ 21 వ సినిమాగా శ్రీరామ్ వేణు దర్శకత్వం లో చేయాల్సి ఉంది . ఆ సినిమా పేరు "ఐకాన్" అలాగే కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కానీ  ఇప్పుడు బన్నీ కొరటాలతో సినిమా అనౌన్స్ చేసేసరికి దిల్ రాజు ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయాలని అనుకుంటున్నారట. అయితే ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత  చేసే సినిమాను చరణ్ ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ చరణ్ కూడా ఈ సినిమాకు నో చెప్తే నానితో చేయాలనీ దిల్ రాజు ప్లాన్ అని సమాచారం.అయితే ఏ హీరో నో చెప్పిన ఈ సినిమాను దిల్ రాజు ఏదో ఒక హీరోతో తప్పకుండ చేస్తాడు అనేది మాత్రం తెలుస్తుంది.