'హిట్' హిందీలో నిర్మించబోతున్న దిల్ రాజు... హీరో ఎవరంటే..?

'హిట్' హిందీలో నిర్మించబోతున్న దిల్ రాజు... హీరో ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన సినిమా హిట్. ఈ సినిమాతో  శైలేష్ కొలను దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందింది. విడుదలైన మొదటి రోజునుండే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు భారీగానే రాబట్టి 'హిట్' సినిమా హిట్ అనిపించుకుంది. అయితే ఈ మధ్య ఓ ఆచారం మొదలైంది, మన తెలుగులో హిట్ అయిన ప్రతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక గత ఏడాది నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాని నిర్మాణంలో వచ్చిన హిట్ సినిమాను కూడా హిందీ రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడట దిల్ రాజు! ఇందులో హీరోగా రాజ్ కుమార్ రావ్ ను ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ హిందీ హిట్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.