థియేటర్లో పవన్ వీరాభిమాని అలియాస్ దిల్ రాజు హంగామా!

థియేటర్లో పవన్ వీరాభిమాని అలియాస్ దిల్ రాజు హంగామా!

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అదో హంగామా! ఇక పవర్ స్టార్ కొంచెం గ్యాప్ తరువాత తిరిగి వచ్చాడు! ఇంకెలా ఉంటుంది? థియేటర్ దద్దరిల్లిపోతోంది. ఇంతలో తెరపై హీరో ఎంట్రీ సీన్! ఇంకేముంది.... డై హార్డ్ ఫ్యాన్స్ ఊగిపోయారు! అరిచారు, గోల చేశారు! ఈ సందడిలోనే ఓ పెద్దాయన సీట్ లోంచి లేచి గాల్లోకి పేపర్లు విసిరేసి పీకే తన అభిమానాన్ని చాటుకున్నాడు! ఆయనెవరో మామూలు అభిమాని అయితే ఇంతగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు! 'వకీల్ సాబ్' నిర్మాత దిల్ రాజు... తాను తీసిన సినిమాలో... తన హీరో ఎంట్రీకే... స్టార్ ప్రొడ్యూసర్ ఫుల్ గా ఎగ్జైట్ అయిపోయాడు. ప్రస్తుతం సొషల్ మీడియాలో ఆయన వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఎందరో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందించాడు దిల్ రాజు. అయినా ఎప్పుడూ పెద్దగా ఉత్సాహానికి, ఉద్వేగానికి లోనుకాని ఆయన 'వకీల్ సాబ్' విషయంలో మాత్రం మొదట్నుంచీ సూపర్ ఎగ్జైటెడ్ గానే ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ దిల్ రాజు తాను పవర్ స్టార్ కి ఎంత పెద్ద ఫ్యానో స్పష్ఠంగానే చెప్పాడు. సినిమా రిలీజ్ వేళ థియేటర్లోనూ మరోసారి నిరూపించుకున్నాడు! తన సినిమా చూడటానికి వచ్చి తానే కాగితాలు ఎగరేస్తూ ఓ నిర్మాత ఎంజాయ్ చేయటం... ఇంతకు ముందు ఎప్పుడూ లేదంటున్నారు పీకే ఫ్యాన్స్! అదే జనసేనాని సత్తా అంటూ పొంగిపోతున్నారు!