సాహో ప్రీ రిలీజ్...మళ్ళీ ఇంతమందిని చూస్తానో లేదో ?

సాహో ప్రీ రిలీజ్...మళ్ళీ ఇంతమందిని చూస్తానో లేదో ?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ మరోసారి ఇంత ఇంత మంది అభిమానులని చూస్తానో లేదో అంటూ మరో ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. బాహుబలితో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనను చూసి వంశీ ప్రమోద్ లు నిర్మాతలుగా మారారని తాను వారిని చూసి ఆలిండియా ఫిలిం ఎలా తీయాలో నేర్చుకుంటున్నా అని దిల్ రాజు తెలిపారు. ఆయన ఏం మాట్లాడారో మీరే వినండి.