'వకీల్ సాబ్'తో రీచ్ లో, రెవిన్యూలో హ్యాపీ: దిల్ రాజు

'వకీల్ సాబ్'తో రీచ్ లో, రెవిన్యూలో హ్యాపీ: దిల్ రాజు

'వకీల్ సాబ్' ప్రజలకు రీచ్ అవడంలోనూ... రెవెన్యూ రాబట్టే విషయంలోనూ మేము సూపర్ హ్యాపీ అంటున్నారు దిల్ రాజు. అన్ని అడ్డంకులు దాటుకుని రిలీజ్ చేశాం.. ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ ని అధిగమించి థియేటర్లో అనుకున్న రెస్పాన్స్ సాధించటానికి మించి ఇంకేం కావలి. మొదటి మూడు రోజులు క్రౌడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ప్రభుత్వం సీటింగ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తాం. ప్రేక్షకులు సినిమా చూడాలి... అదే టైమ్ లో కొవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలి. సేఫ్ గా ఇంటికి వెళ్లాలన్నదే నా కోరిక. ఇక దేశంలో మిగతా చిత్ర పరిశ్రమలతో చూస్తే మన టాలీవుడ్ చాలా సేఫ్ అని చెప్పాలి. క్రాక్ దగ్గర నుంచి ఉప్పెన, జాతిరత్నాలు, జాంబిరెడ్డి ఇలా పలు సక్సెస్ లు వచ్చాయంటున్నారు దిల్ రాజు. 'వకీల్ సాబ్ మహిళలకు కావాల్సిన సినిమా. మా సినిమా మహిళలకు దగ్గరైంది. బయట పరిస్థితులు బాగా లేకున్నా మా సినిమాకు ఆదరణ తగ్గ లేదు. ఇక మా టీమ్ అందరికీ కరోనా వచ్చిందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. కరోనా సోకిన వారు స్వయంగా వెల్లడించారు' అని దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పారు.