‘అద్భుతం’ను ఆవిష్క‌రించిన దిల్‌ రాజు...

‘అద్భుతం’ను ఆవిష్క‌రించిన దిల్‌ రాజు...

ఒక వ్య‌క్తి... ఆ వ్య‌క్తికి సంబంధించిన కుటుంబం బావుంటే అంతా బావున్నట్టేనా!? కొన్ని కోట్లాది కుటుంబాల క‌ల‌యిక వ‌ల్ల ఏర్ప‌డిన ఈ స‌మాజం ఎలా ఉండాలి? ఎలా ఉంటే బావుంటుంది? భావి త‌రాల‌కు మంచి స‌మాజాన్ని మ‌నం ఇస్తున్నామా?  ఇవ‌న్నీ మనం ఆలోచించాల్సిన విష‌యాలు. ఈ ఆలోచ‌న‌ల స‌మాహారంగా రూపొందిన న‌వ‌ల ‘అద్భుతం’. దీనిని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు ఇటీవల ఆవిష్క‌రించారు. 'దిల్‌' రాజు దగ్గర రైటింగ్,  డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసిన వసంత కిరణ్ ఈ నవలను రాశారు. 'దీనిని సినిమాగా తీయాలనే ఉద్దేశ్యంతో పక్కా స్క్రీన్ ప్లేతో రాసుకున్న నవల ఇదని, సినిమా కంటే ముందుగా ఇలా పుస్తక రూపంలో రావడం ఆనందంగా ఉంద'ని రచయిత వసంత కిరణ్ చెప్పారు. ఈ నవలకు 'అద్భుతం' అనే పేరు సూచించి, పుస్తక రూపంలో రావడానికి సహకరించిన మిత్రుడు సత్య కాశీ భార్గవకు వసంత్ ధన్యవాదాలు తెలిపారు.