అంగరంగ వైభవంగా దిల్ రాజు వివాహం...
దిల్ రాజు వివాహం అంగరంగ వైభవంగా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నిజామాబాద్ జిల్లాలోని నార్సింగ్ పల్లి గ్రామంలో జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం.
దిల్ రాజు మొదటి భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రాజు ఒంటరిగా ఉంటున్నారు. దిల్ రాజు రెండో వివాహం చేసుకుంటారని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)