సోనూ ఆదుకుంటానని చెప్పిన పిల్లల్ని దత్తత తీసుకుంటానంటున్న దిల్ రాజు..!

సోనూ ఆదుకుంటానని చెప్పిన పిల్లల్ని దత్తత తీసుకుంటానంటున్న దిల్ రాజు..!

ఇటీవల సోనూ సూద్  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన ముగ్గురు అనాథ పిల్లలను ఆదుకుంటానని ప్రకటించారు. పిల్లల తల్లి తండ్రులు అకాల మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. దాంతో పిల్లల్లో పెద్దవాడైన 9 ఏళ్ల బాలుడు మిగతా ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటున్నాడు. కాగా ఈ బాలల కు సంబందించిన కథనం వార్తల్లో రావటంతో ఎంతోమంది చలించిపోయారు. ఇక ఈ కథనం చూసిన రియల్ హీరో సోనూసూద్ వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వారు ఎంత‌మాత్రం అనాథ‌లు కార‌ని, వారి బాధ్య‌త తాను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారిని మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌కు తీసుకువ‌చ్చి ఓ ఆశ్ర‌మంలో ఉంచుతాన‌ని తెలిపారు. ఇక మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం వారి ప‌రిస్థితి పై చాలించారు. వారి భాద్యతను తన భుజాలపై వేసుకుంటాని హామీ ఇచ్చారు. వారిని దత్తత తీసుకునేందుకు ముందుకువచ్చారు. అయితే ఆ పిల్లలు ఎవరిదగ్గరకు వెళతారనేది వారి నిర్ణయం పైనే ఆధారపడి ఉంది.