ఇక దిల్ రాజు సినిమాల స్క్రిప్ట్ ఇంగ్లీష్ లోనే!

ఇక దిల్ రాజు సినిమాల స్క్రిప్ట్ ఇంగ్లీష్ లోనే!

సినిమాల జయాపజయాలను బేరీజు వేయడంతో దిల్ రాజుకు మంచి అనుభవం ఉందన్నది ఫిల్మ్ నగర్ టాక్. చాలామంది నిర్మాతలు, దర్శకులు... తమ సినిమా కథలను దిల్ రాజుకు వినిపించి, ఆయన అభిప్రాయం తెలుసుకుని, మార్పులు, చేర్పులపై సలహాలు కోరుతుంటారు. దిల్ రాజు సైతం సమయం దొరికితే... వారికి ఉచిత సలహా ఇస్తుంటారు. నిజానికి ఓ కథను అంతగా జడ్జి చేయగలిగితే తానూ అన్నీ సక్సెస్ ఫుల్ మూవీసే తీసే వాడినని దిల్ రాజు సరదాగా  చెబుతుంటారు. అయినా... అనుభవంతో ఆయన చెప్పే సూచనలను పాటించే నిర్మాతలూ ఉన్నారు. ఇదిలా ఉంటే... 'దిల్' రాజు ప్రొడక్షన్ హౌస్ నిరంతరం స్టోరీ డిస్కషన్స్ తో కళకళలాడుతుందనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఈ హౌస్ లోకి దిల్ రాజు భార్య వేఘా రెడ్డి సైతం అడుగుపెట్టారట. రైటింగ్ స్కిల్స్ ఉన్న మహిళ కావడంతో  సినిమాల స్క్రిప్ట్ ను జడ్జ్ చేసే బాధ్యత ఇప్పుడు దిల్ రాజు తన భార్యకు అప్పచెప్పారని తెలుస్తోంది. అయితే... తెలుగు కంటే ఇంగ్లీష్ ను బాగా అర్థం చేసుకునే ఆమె కోసం... ఇక మీదట స్క్రిప్ట్స్ ను ఇంగ్లీష్ లో తయారు చేయమని దిల్ రాజు కోరుతున్నారట. సో... శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు చేయాలనుకునే దర్శకులు ఇక మీదట తమ ఇంగ్లీష్ నాలెడ్జ్ ను పదను పెట్టుకోవడం మంచిదని అంటున్నారు. మరి వైఘా రెడ్డి నేతృత్వంలో ఎంపికయ్యే కథలు దిల్ రాజుకు నిర్మాతగా ఏ స్థాయి గుర్తింపును, లాభాలను తెచ్చిపెడతాయో చూడాలి.