టైటిల్ వేటలో దిల్ రాజు

టైటిల్ వేటలో దిల్ రాజు

టాలీవుడ్ లో  అభిరుచి కలిగిన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.  ఆయన సినిమాలు మిగతా సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి.  ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా చూసే విధంగా ఉంటాయి.  అందుకే ఆయన నిర్మాతగా ఇప్పటికి నిలబడగలిగారు.  రీసెంట్ గా వచ్చిన ఎఫ్2 సినిమాకు ముందు వరకు దిల్ రాజు కొన్ని ఇబ్బందులు పడ్డాడు.  వరసగా సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.  

ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మళ్ళా తిరిగి ఫామ్ లోకి వచ్చారు.  తమిళంలో సూపర్ హిట్టైన 96 సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే.  తెలుగులో 96 ను రీమేక్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.  తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటిస్తే.. తెలుగులో సమంత, శర్వానంద్ లు నటిస్తున్నారు.  

ప్రస్తుతం రీమేక్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు వినికిడి.  1996 వ సంవత్సరానికి సంబంధించిన కథ కావడంతో.. అప్పటికి వెళ్లి దానికి తగ్గట్టుగా చూపించాలి.  అంతేకాదు మన తెలుగు సినిమా నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ రావాలి.  తమిళంలో ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది.  అయినా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైంది.  తెలుగులో అంత స్లోగా ఉంటె నడవదు.  స్పీడ్ పెంచాలి.  అలాగే టైటిల్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా అలోచించి టైటిల్ పెట్టాలి.  96 అంటే మనవాళ్లకు పెద్దగా ఎక్కదు.  కాబట్టి క్యాచీగా పవర్ఫుల్ గా ఉండే టైటిల్ ను ఎంచుకోవాలి.  ఇవన్నీ సవాల్ తో కూడుకున్నవే.  ఈ ఉగాది వరకు ఎలాగైనా మంచి టైటిల్ ఆలోచించాలని దిల్ రాజు లక్ష్యంగా పెట్టుకున్నాడు.  ఉగాది నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లి.. ఆగస్టులో రిలీజ్ చేయాలని రాజు ప్లాన్ చేస్తున్నాడు.