'ఐకాన్‌ స్టార్‌' అని ఆయనే పెట్టుకున్నారు: దిల్ రాజు

'ఐకాన్‌ స్టార్‌' అని ఆయనే పెట్టుకున్నారు: దిల్ రాజు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో తదుపరి సినిమాగా 'ఐకాన్‌' రూపొందనున్నట్లు దిల్‌రాజు స్పష్టం చేశారు. గతంలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. అయితే 'వకీల్‌సాబ్‌' తెరకెక్కిస్తుండటంతో 'ఐకాన్‌' వాయిదా పడింది. వకీల్ సాబ్ పూర్తికావడంతో అల్లుఅర్జున్ చిత్రంపై దిల్ రాజు స్పందించారు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా 'ఐకాన్‌' రానున్నట్లు తెలిపారు. దర్శకుడు వేణు శ్రీరామ్ కథ చెప్పిన దగ్గరి నుంచి దానితోనే ప్రయాణం చేశాం. స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. ఇతర కారణాల వల్ల కాస్త ముందూ వెనుక అవుతుందంతే.. త్వరలోనే ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు. కాగా, 'ఐకాన్‌ స్టార్‌' పై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘పుష్ప’ టీజర్‌ చివరిలో అల్లు అర్జున్‌ పేరు ముందు ‘స్టైలిష్‌ స్టార్‌’కు బదులుగా ‘ఐకాన్‌ స్టార్‌’ అని ఎందుకు వేశారని దిల్‌రాజును ప్రశ్నించగా, 'ఐకాన్‌ స్టార్‌' అనేది అల్లుఅర్జున్ పేరేమో, ఆయన పెట్టుకున్నారేమో, తమకు తెలియదని బదులిచ్చారు.