టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. దిల్ రాజుకు పాజిటివ్

టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. దిల్ రాజుకు పాజిటివ్

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది.  ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను.. ఉన్నతాధికారులను ఇలా ఎవ్వరు దొరికితే వాళ్లు అనే తరహాలో కరోనా వైరస్ సోకింది.. ఇక, ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు. వకీల్ సాబ్ మూవీ ప్రచారంలో భాగంగా కొద్ది రోజులుగా ఆడియన్స్ తో కలిసే ఉన్నాడు. సాధారణ అభిమానులతో కలిసి దిల్ రాజు థియేటర్ లో పేపర్లు ఎగురవేయడం కూడా చూశాం. ఇది ఇలా ఉండగా తాజాగా దిల్ రాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్ళందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని దిల్ రాజు కోరారు. కాగా.. ఇటీవలే వకీల్ సాబ్ మూవీ భామ నివేదా థామస్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.