దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్..!!?

దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్..!!?

ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా నైజాం.. ఉత్తరాంధ్ర హక్కులను దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే.  దాదాపు రూ.45 కోట్ల రూపాయలకు హక్కులను తీసుకున్నారు.  గతంలో దిల్ రాజు ప్రభాస్ తో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేశారు.  ఆ తరువాత ప్రభాస్ బిజీ కావడంతో సినిమా చేయలేకపోయాడు.  

ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ఇండియన్ స్టార్ కావడంతో చిన్న నిర్మాతల సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడా అన్నది డౌట్ గా మారింది.  ప్రభాస్ తో సినిమా అంటే మినిమమ్ రూ. 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది.  దిల్ రాజు దానికి సమర్ధుడు.. ప్రభాస్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చి ప్రభాస్ ను ఈ విషయం అడిగాడట.  

ప్రభాస్ ఒకే చెప్పినట్టు సమాచారం.  మంచి స్క్రిప్ట్ ఉంటె తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారట.  సాహా తరువాత ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు.  ఇది జనవరికి రిలీజ్ కాబోతున్నది.