కథా రచయిత్రిగా దిల్ రాజు సతీమణి

కథా రచయిత్రిగా దిల్ రాజు సతీమణి

ప్రముఖ నిర్మాత ‘దిల్‘ రాజు టీమ్ మేనేజ్ మెంట్ లో సిద్ధహస్తుడు. ఎవరిని, ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఓ వ్యక్తిలో యూనిక్ క్వాలిటీ ఏదైనా ఉందని తెలిస్తే, అతన్ని ఎంకరేజ్ చేయడంలో దిల్ రాజు ముందుంటాడు. అందుకే ఆయన కాంపౌండ్ నుండి ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చారు. అప్ కమింగ్ డైరెక్టర్స్ సైతం ఆయన బ్యానర్ లో సూపర్ హిట్స్ ఇచ్చారు. కథలను జడ్జ్ చేయడంలో దిల్ రాజుది సూపర్ మైండ్ అని సన్నిహితులు చెబుతుంటారు. అయితే... ఆరు నెలల సావాసంతో వారు వీరు అవుతారనే సామెత ఇప్పుడు దిల్ రాజు విషయంలోనూ నిజమైందనేది ఇండస్ట్రీ టాక్. 

దిల్ రాజు సతీమణి తేజస్వినికి కథల విషయంలో మంచి ఆసక్తి ఉందట. ఆమె మదిలో మెదిలిన ఓ స్టోరీ లైన్ ను దిల్ రాజుకు చెప్పగానే, ఆయనకు నచ్చి, ఓ రైటర్స్ టీమ్ కు ఫార్వర్డ్ చేశాడట. ఆ కథను తన ఆలోచనలకు తగ్గట్టుగా డెవలప్ చేసే పనిని తేజస్వినికే అప్పగించాడట. సో... అతి త్వరలోనే దిల్ రాజు సతీమణి పేరు స్టోరీ రైటర్ గా వెండితెర మీద కనిపించే ఆస్కారం ఉంది. 

రాబోయే రోజుల్లో దిల్ రాజుకు చేదోడువాదోడుగా తేజస్విని సైతం కథలను విని జడ్జ్ చేసే ఆస్కారం లేకపోలేదు. దిల్ రాజు తనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులనూ తన కార్యకలాపాలలో నిమగ్నం చేయడం ఇవాళ కొత్త కాదు. సోదరుడు శిరీష్... దిల్ రాజు చిత్రాలకు నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తుంటాడు. అలానే హర్షిత్ రెడ్డి నిర్మాణ వ్యవహారాలు చూస్తుంటాడు. ఇక దిల్ రాజు కుమార్తె, అల్లుడు ఓటీటీ సంస్థ ‘ఆహా‘లో భాగస్వాములుగా ఉన్నారు. సో... తన వాళ్లందరి సహాయసహకారాలతో దిల్ రాజు అలా ముందుకెళ్ళిపోతున్నారు.