వీడియో: కార్తీక్ సూపర్ క్యాచ్

వీడియో: కార్తీక్ సూపర్ క్యాచ్

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ దినేష్ కార్తీక్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌ జట్టు 164/2తో (14.5 ఓవర్లలో) పటిష్ట స్థితిలో ఉండి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. కివీస్ బ్యాట్స్‌మెన్‌ డారిల్ మిచెల్ అప్పటికే ఒక ఫోర్ కొట్టి టచ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్ చివరి బంతిని డారిల్ మిచెల్ భారీ షాట్‌ ఆడాడు. సిక్స్ వెళ్తుందనుకున్న బాల్‌ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కార్తీక్ అందుకున్నాడు. ఇదే సమయంలో బ్యాలెన్స్ తప్పడంతో.. బాల్‌ను లోపలికి విసిరి బౌండరీ లైన్ అవతలికి వెళ్లాడు. వెంటనే బౌండరీ లైన్ దాటి డైవ్ చేసి మరీ బంతిని  పట్టుకున్నాడు. దీంతో డారిల్ మిచెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ సూపర్ క్యాచ్ ను మీరూ చూడండి.