బీసీసీఐ నోటీసులు.. క్షమాపణ చెప్పిన దినేష్ కార్తీక్..!

బీసీసీఐ నోటీసులు.. క్షమాపణ చెప్పిన దినేష్ కార్తీక్..!

బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో బేషరతుగా క్షమాపణలు చెప్పాడు టీమిండియా సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్.. వివరాల్లోకి వెళ్తే.. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్‌ అయిన కార్తీక్.. ఎలాంటి అనుమతి లేకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌కు వెళ్లాడు.. ఆ జట్టు తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ట్రిన్‌బాగో జట్టు జెర్సీ ధరించి.. ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని మ్యాచ్‌ను తిలకించడంపై.. అయితే, దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్‌ను బ్రేక్ చేస్తూ సీపీఎల్‌ జట్టు డ్రెసింగ్‌ రూమ్‌లో కనిపించడంతో మీ కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ దినేష్ కార్తీక్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి కార్తీక్ బేషరతుగా క్షమాపణలు చెప్పేశారు. కగా. ట్రిన్‌బాగో టీమ్.. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌దే.. మరోవైపు షారుక్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌లో దినేష్‌ కార్తీక్‌ కెప్టెన్‌గా ఉన్నసంగతి తెలిసిందే. మరీ.. కార్తీక్ క్షమాపణలు చెప్పిన తర్వాత బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.