అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్ లో శివకటాక్షం లభించేది ఎవరికో!?

అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్ లో శివకటాక్షం లభించేది ఎవరికో!?

అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్... ఈ ఇద్దరూ టాలీవుడ్ ఇప్పుడు టాప్ లిస్ట్ లో ఉన్న దర్శకులు. 'సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌2, సరిలేరు నీకెవ్వరూ' వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో అజేయంగా సాగిపోతున్నాడు అనిల్ రావిపూడి. ఇక 'ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి' వంటి చక్కటి సినిమాలతో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ప్రభాస్ తో ప్యాన్ ఇండియా సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు వీరిద్దరూ నిర్మాతలుగా మారారు.

అనిల్ రావిపూడి 'గాలి సంపత్' సినిమాతో నిర్మాతగా మారగా నాగ్ అశ్విన్ 'జాతి రత్నాలు' అంటూ నిర్మాతగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు శివరాత్రి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల తీర్పుకోసం వస్తున్నాయి. రెండు సినిమాల ట్రైలర్స్ మార్కెట్ లో మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. జాతి రత్నాలు లో నవీన పోలిశెట్టి హీరో కాగా, శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ 'గాలి సంపత్'తో ముఖ్య పాత్రధారులు. ఒకే రోజున రాబోతున్న ఈ రెండు చిత్రాలు నిర్మాతలుగా అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్ కి కఠిన పరీక్ష పెడుతున్నాయి. శివరాత్రి కానుకగా రాబోతున్న ఈ రెండు చిత్రాలలో ఏ సినిమాకి శివకటాక్షం లభిస్తుందన్నది పెద్ద పజిల్. మరి అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్ లో ఎవరికి శివకటాక్షం లభిస్తుందన్నది తెలియాలంటే 11 వరకూ ఆగాల్సిందే.