మహేష్ కోసం అనిల్ రావిపూడి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా..?

మహేష్ కోసం అనిల్ రావిపూడి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా..?

భరత్ అనే నేను... మహర్షి సినిమాలు హిట్ తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే కథ, కథనాలను లాక్ చేశారు.  పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కబోతున్నది.  తెరపై టైమింగ్ కామెడీని పండించడంలో మహేష్ దిట్ట అనే సంగతి తెలిసిందే.  సెట్స్ లో ప్రతి ఒక్కరితో జోక్స్ వేస్తూ చాలా సరదాగా ఉంటాడని, మహేష్ టైమింగ్ జోక్స్ బాగుంటాయని సహచరులు చెప్తుంటారు.  

మహేష్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా కష్టపడుతున్నాడు.  కథను లాక్ చేసినా.. టైటిల్ విషయంలో దర్శకుడు ఇప్పటి వరకు ఓ అభిప్రాయానికి రాలేదట.  అనేక టైటిల్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  మొదట సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ అనుకున్నా, మహేష్ బాబు మూడు అక్షరాలా పేరు పెట్టాలని సూచించారని వార్తలు వచ్చాయి.  ఇప్పుడు రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్ తెరమీదకు వచ్చింది.  ఈ టైటిల్ కన్ఫామ్ అనే గ్యారెంటీ లేదు.  మరిన్ని టైటిల్స్ తెరమీదకు వస్తాయో చూడాలి.