అల్లు అర్జున్ సినిమా దర్శకుడు మారిపోయాడా ?

అల్లు అర్జున్ సినిమా దర్శకుడు మారిపోయాడా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు గత ఏడాదే ఏర్పాటు జరిగాయి.  నిర్మాత జ్ఞానవేల్ రాజా లింగుస్వామి దర్శకుడిగా ఒక ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేశారు.  కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పై మరొక అప్డేట్ ఏదీ రాలేదు. 

తాజాగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ చిత్ర దర్శకుడు మారినట్టు తెలుస్తోంది.  లింగుస్వామి స్థానంలో 'వివేగం, విశ్వాసం' చిత్రాలు దర్శకుడు శివను తీసుకున్నారట.  అంతేగాక 2019 వేసవికి సినిమా పట్టాలెక్కుతుందని కూడ అంటున్నారు.  మరి ఈ వార్తలు ఎంత మేరకు నిజమవుతాయో చూడాలి.