బయోపిక్ నుండి జగన్ ఔట్ !

బయోపిక్ నుండి జగన్ ఔట్ !

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' పేరుతో బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే.  కాగా ఇందులో వైఎస్ తనయుడు వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషిస్తారు అనే దానిపై చాలా రోజుల నుండి సందిగ్దత నెలకొంటూ వస్తోంది.  

కానీ ఇప్పుడు అసలు సినిమాలో జగన్ పాత్రే ఉండదని, స్క్రిప్ట్ నుండి జగన్ సన్నివేశాలను తొలగించేశారని తెలుస్తోంది.  దర్శకుడు రాఘవ్ సినిమా వైఎస్ 2003లో చేసిన 1500 కిలోమీటర్ల పాదయాత్రను ఆధారంగా చేసుకుని మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నారట.  అందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.  మమ్ముటి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరుకి రిలీజ్ చేయనున్నారు.