విరాటపర్వం లో సాయి పల్లవి పాత్ర పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు... 

విరాటపర్వం లో సాయి పల్లవి పాత్ర పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు... 

'ఫిదా' సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమాలో తన నటనతో అందరిని ఫిదా చేసింది పల్లవి. ఆ సినిమా తరవాత తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక సాయిపల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచీ ఇందులో ఆమె చేస్తోన్న పాత్ర గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఓ నక్సలైట్ ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ఇక ఈ సినిమాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నక్సలైట్, విప్లవ గాయని పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. పల్లవి పాత్రపై వస్తున్న వార్తలో అసలు నిజం లేదు అని చెప్పారు. అంతే కాకుండా ఇందులో పల్లవి ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్నారని, ఆ పాత్ర ఈ సినిమాలో చాల ముఖ్యమని తెలిపారు. ఈ సినిమాను డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.  ఇక, ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ రిచర్‌ ఆధ్వర్యంలో తెరకెక్కించనున్నారు.