క్రాక్ థియేటర్స్ లోనే... స్పష్టం చేసిన డైరెక్టర్

క్రాక్ థియేటర్స్ లోనే... స్పష్టం చేసిన డైరెక్టర్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్ లు సైతం నిలిచిపోయాయి. ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో షూటింగ్ లు జరపడం లేదు. ఇకపోతే థియేటర్స్ లేకపోవటంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఓటిటి వేదికగా రిలీజ్ అవుతున్నాయి. దాంతో  ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. అయితే మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'క్రాక్' . చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక 'క్రాక్' ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై స్పందించిన క్రాక్ దర్శకుడు వాటన్నింటికి చెక్ పెట్టేసాడు. గోపీచంద్ మలినేని తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసాడు. అందులో క్రాక్ తప్పకుండా థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని తెలిపాడు. ఇక ఈ సినిమా తర్వాత 'రాక్షసుడు' సినిమా ఫెమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది.