కోరుకుంటే.. గబ్బర్ సింగ్ లా హిట్ అవుతుంది..!!

కోరుకుంటే.. గబ్బర్ సింగ్ లా హిట్ అవుతుంది..!!

పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఒకటి గబ్బర్ సింగ్.  హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.  ఇందులో పవన్ చూపించిన విధానం అందరికి నచ్చింది.  ఇప్పుడు వరుణ్ తేజ్ ను అదే విధంగా నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో వాల్మీకిగా చూపిస్తున్నారు.  గబ్బర్ సింగ్ సమయంలో అభిమానులు ఎలాగైతే మంచి విజయం సాధించాలని కోరుకున్నారో.. అదే విధంగా వాల్మీకి సినిమా కూడా మంచి విజయం కావాలని అభిమానులు కోరుకుంటే.. తప్పని సరిగా సినిమా విజయం సాధిస్తుందని హరీష్ శంకర్ పేర్కొన్నారు.