వకీల్‌సాబ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న మారుతి.. కారణం అదే..

వకీల్‌సాబ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న మారుతి.. కారణం అదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటగా హిందీ హిట్ సినిమా పింక్ రీమెక్‌గా తెరకెక్కుతున్న వకీల్‌సాబ్‌ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ దాదాపు ఆరు సినిమాలను లైన్‌లో పెట్టాడట. అయితే ఇటీవల చిత్రీకరణ పూర్తిచేసుకున్న వకీల్‌సాబ్ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ సినిమా అభిమానులు ఎంతటి అంచనాలు పెట్టుకున్నారో తెలీదు కానీ దర్శకుడు మారుతి మాత్రం పెద్ద స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నాడట. వకీల్‌సాబ్ సినిమాను తెరకెక్కించింది మారుతు కాదు. వేణు శ్రీరామ్ ఈ సినిమా తెరకెక్కించాడు. అసలు వకీల్‌పాబ్ సినిమాతో మారుతికి ఎటువంటి సంబంధంలేదు. కానీ వకీల్‌సాబ్ ఓ కోర్టురూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అదే అందుకోసమే మారుతి ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడట. మారుతి తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్‌తో చేసేందుకు సిద్దమయ్యాడు.  ఈసినిమా పక్కా కమర్షియల్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాతో మారుతి మొదటి సారి కోర్టు రూమ్ డ్రామాను రూపొందించనున్నాడు. అంతేకాకుండా హీరో గోపీచంద్‌కు కూడా ఈ సినిమాతో మొదటిసారి కోర్టురూమ్ డ్రామాగా చేస్తున్నాడు. కథ విన్న వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాడు. అందుకోసమే వకీల్‌సాబ్ సినిమా ఫలితాల కోసం వీరు చూస్తున్నారు. వకీల్‌సాబ్ సినిమా హిట్ అయితే ప్రేక్షకులు కోర్టురూమ్ డ్రామాను ప్రోత్సహిస్తారు. దాంతో మారుతి తన సినిమాను పూర్తి చేయడమే కాకుండా ఈ తరహా కథలు మరికొందరు తీసే విధంగా ప్రేరేపించ గలుగుతారు భావిస్తున్నాడట. ఈ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. త్వరలోనే పేరును, ఫస్ట్‌ లుక్‌ను ఫిక్స్ చేస్తారట.