స్పైడర్ దర్శకుడికి తెలుగులో మరో ఛాన్స్... ఎన్టీఆర్ కాదు... 

స్పైడర్ దర్శకుడికి తెలుగులో మరో ఛాన్స్... ఎన్టీఆర్ కాదు... 

తమిళ దర్శకుడు మురుగదాస్ ఎన్నో సినిమాలు చేశారు.  తమిళంలో అయన చేసిన సినిమాలు దాదాపుగా సంచలన విజయం సాధించాయి.  తమిళంలో సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  అయితే తెలుగులో చేసిన రెండు స్ట్రెయిట్ సినిమాలు మాత్రం బోల్తా కొట్టాయి.  మెగాస్టార్ తో స్టాలిన్ సినిమా తీశారు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా బోల్తా కొట్టింది.  

ఆ తరువాత మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేశారు.  మహేష్ బాబు స్టార్ ఇమేజ్ కు ఏ మాత్రం సినిమా సెట్ కాలేదు.  సినిమాలో హీరో పాత్ర కంటే విలన్ రోల్ హైలైట్ కావడంతో సినిమా ఫెయిల్ అయింది.  స్టైలిష్ గా తీసిన సినిమా భారీ పరాజయం పాలైంది.  అయితే, మహేష్ బాబును తమిళంలో ఇంట్రడ్యూస్ చేయాలనే తపనతో తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోయానని మురుగదాస్ చెప్పారు.  అంతకు ముందు ఎన్టీఆర్ కు మురుగదాస్ ఓ కథ చెప్పారట.  కానీ, ఆ కథ వర్కౌట్ కాలేదని, ఇప్పుడు ఎన్టీఆర్ తో మురుగదాస్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో నిజం లేదని మురుగదాస్ చెప్తున్నారు.  తెలుగులో ఇప్పటికే ఓ సినిమా ఖరారైనట్టు చెప్తున్నారు.  అందులో ఎవరు నటిస్తున్నారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నది.