టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి శుక్రవారం ఉదయం మరణించారు. ఈ మేరకు బీఏ రాజు ట్వీట్‌ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చక్రవర్తి ఈ రోజు ఉదయం కన్ను మూశారని రాజు ట్వీట్‌ చేశారు. చక్రవర్తి శోభన్ బాబుతో 1984లో 'సంపూర్ణ ప్రేమాయణం', 1985-86లో నందమూరి బాలకృష్ణ నటించిన 'కత్తుల కొండయ్య','నిప్పులాంటి మనిషి' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు 1986లో వచ్చిన 'కాష్మోరా'చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ప్రజాధారణ పొందింది. సీనియర్ దర్శకుడి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.