దర్శకుడికి ఫోన్ కాల్స్ పెరిగాయట !

దర్శకుడికి ఫోన్ కాల్స్ పెరిగాయట !

దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయా అంటే అనువనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.  మొదటి ప్రయత్నంలోనే 'అ !' లాంటి భిన్నమైన సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన ప్రశాంత్ వర్మ తాజాగా చేస్తున్న చిత్రం 'కల్కి'.  సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో హీరో.  ఇటీవలే సినిమా ట్రైలర్ విడుదలైంది.  ట్రైలర్లో కథ ఏమిటో చెప్పలేదు కానీ సినిమాపై ఆసక్తిని రేకెత్తించే కంటెంట్ అయితే అందులో ఉంది.  

మంచి విజువల్స్, కొత్తగా కనిపిస్తున్న రాజశేఖర్ నటన, ఆకట్టుకునే నేపథ్య సంగీతం అన్నీ కలిసి ట్రైలర్ హిట్టయ్యేలా చేశాయి.  అది చూసిన కొందరు యువ హీరోలు తమతో సినిమా చేయమని ప్రశాంత్ వర్మను ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నారట.  మరి ఈ యువ దర్శకుడు ఏ హీరోకి కథ చెబుతాడో చూడాలి.  ఇకపోతే ప్రశాంత్ వర్మ వర్క్ నచ్చి 'అ !' సినిమా సమయంలోనే నాని అతనితో ఒక  సినిమా చేసేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.