ప్రభాస్ దర్శకుడి  ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్

ప్రభాస్ దర్శకుడి  ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం రాధే శ్యామ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జూలై 10న చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మూవీ మేకర్స్‌. అయితే పోస్టర్‌కి విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు . ఇక పోస్టర్ వైరల్ అవుతున్న క్రమంలో  డైరెక్టర్ రాధాకృష్ణ ‌కి ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ని బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్‌ఫాం చేస్తూ.. నేను వేరే వ్యక్తిలా నటిస్తున్నానంటా, ఆ వ్యక్తి ఎవరో మరి అంటూ ట్వీట్‌లో తెలిపాడు.కాగా, కరోనా వలన చిత్ర రిలీజ్‌కి బ్రేక్ పడగా, ఏడాది చివరలో మూవీ రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది.