ఏడేళ్ల క్రితమే ఐడియా.. ఇప్పుడు అలసిపోయా..!!

ఏడేళ్ల క్రితమే ఐడియా.. ఇప్పుడు అలసిపోయా..!!

దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా.. ఓ సంచలనమే. సినిమాలో భారీతనం కనిపిస్తుంది.  శంకర్ సినిమాల కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్దపడుతుంటారు.  ఇందుకు ఉదాహరణ రోబో 2పాయింట్ ఓ.  ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే నిర్మాతలు రూ.540 కోట్లు ఖర్చు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు.  

ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఆలస్యం అయింది.  సంవత్సరం క్రితం విడుదల కావాల్సిన సినిమా సంవత్సరం ఆలస్యం అయింది.  ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో యూనిట్ ఊరట చెందింది.  ఈ సినిమా పూర్తికావొస్తున్న తరుణంలో శంకర్ తన నెక్స్ట్ మూవీ భారతీయుడు 2 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.  

20 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసినట్టు శంకర్ పేర్కొన్నాడు.  ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. అప్పట్లో సీక్వెల్ గురించి ఆలోచించలేదని అన్నారు.  ఏడేళ్ల క్రితమే భారతీయుడు 2 కు సంబంధించిన ఐడియా వచ్చిందని.. రోబో 2 పాయింట్ ఓ సినిమా తరువాత ప్లాన్ చేద్దామని అనుకున్నట్టు శంకర్ చెప్పారు.  ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా అలసిపోయానని, భారతీయుడు విషయంలో అలా కాకుండా అనుకున్న సమయానికి ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు శంకర్ చెప్పారు.