గ్రీన్ ఇండియా ఛాలెంజ్...మొక్కలు నాటిన దర్శకుడు.!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్...మొక్కలు నాటిన దర్శకుడు.!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నలుమూలలా వ్యాపిస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఒకరి తరవాత మరొకరు మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  భాగంగా  హీరో అడవి శేషు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి దర్శకుడు శశీ (మేజర్ సినిమా) నేడు ఖాజాగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు.  
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా మంచి ఛాలెంజ్ ను చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరం మొక్కలను పెంచి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన మిత్రులు శరత్ చంద్ర; అనురాగ్ మారెడ్డి లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసారు.