దర్శకుడిగా ఫెయిల్... నటుడిగా సూపర్ హిట్
నటుడుగా బాగా రాణించిన వ్యక్తులు ఏదో ఒక సమయంలో మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారాలని అనుకుంటాడు. ఇలా నటుడి నుంచి దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి నటుడిగా మారిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ, దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి... కెరీర్ స్టార్టింగ్ లో సూప్ హిట్ చిత్రాలు తీసి, ఆ తరువాత నటుడిగా మారి బిజీ అయిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు.
ఇలాంటి వ్యక్తుల్లో ఒకరు ఎస్.జె సూర్య. వాలి, ఖుషి వంటి సినిమాలతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ఆ తరువాత మహేష్ బాబుతో నాని, పవన్ తో కొమరం పులి సినిమాలు చేసి భారీ పరాజయం అందుకున్నారు. చాలా గ్యాప్ తీసుకొని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఇరైవి సినిమాలో నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తరువాత మహేష్ స్పైడర్ సినిమాలో విలన్ గా చేశాడు. సినిమా ప్లాపైనా... విలన్ పాత్రకు మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా మాన్ స్టర్ సినిమా చేశాడు. ఒక ఎలుక వలన మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తి ఎలా ఇబ్బంది పడ్డాడు అన్నది కథ. నెల్సన్ వెంకటేశన్ అద్భుతంగా చిత్రీకరించిన ఈ సినిమా ప్రసంశలు అందుకుంటోంది. క్రిటిక్స్ సైతం ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావడంతో సూర్య చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. దర్శకుడిగా ఫెయిల్ అయినా సూర్యకు నటుడిగా మంచి పేరు వచ్చింది. అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)