తేజ డబుల్ ధమాకా... టాప్ హీరోలతో రెండు సినిమాలు... 

తేజ డబుల్ ధమాకా... టాప్ హీరోలతో రెండు సినిమాలు... 

దర్శకుడు తేజ ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఇందులో ఒకటి అలివేలుమంగ వెంకట రమణ కాగా, రెండోసినిమా రాక్షస రాజు రావణాసురుడు.  ఈ రెండు సినిమాల్లో స్టార్ హీరోలు నటిస్తున్నారు.  అలివేలుమంగ వెంకట రమణ సినిమాలో గోపీచంద్ హీరోగా చేస్తున్నారు.  జయం, నిజం సినిమాల్లో గోపిచంద్ విలన్ గా నటించారు.  ఈ సినిమాలు అప్పట్లో సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి.  గోపిచంద్ విలన్ గా రాణించారు.  

ఆ తరువాత హీరోగా అద్భుతమైన చిత్రాలు చేశారు.  గత కొంతకాలంగా గోపిచంద్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కుదేలవుతున్నాయి.  ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో పనిచేస్తున్నారు.  కాగా ఇప్పుడు ఈ స్టార్ హీరో తేజ దర్శకత్వంలో సినిమా చేస్తుండటం విశేషం.  ఈ సినిమాతో పాటుగా రాక్షస రాజు రావణాసురుడు సినిమా కూడా ప్రారంభం అవుతుందట.  రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన తేజ, ఆయనతో కలిసి రాక్షస రాజు రావణాసురుడు సినిమా చేస్తున్నారు.  ఈ రెండు సినిమాలు ఒకేరోజున ప్రకటించడం విశేషం.