కాజల్ తో చేయడానికి ఎవరు ఒప్పుకోలేదట

కాజల్ తో చేయడానికి ఎవరు ఒప్పుకోలేదట

కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సీత సినిమా మే 24 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  సీత సినిమా కథ గురించి కాజల్ కు కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసునని, సినిమాగా చేయాల్సి వస్తే తనతోనే చేయాలని అడిగిందని తేజ అన్నాడు.  

అనుకున్నట్టుగానే తేజ సీత స్టోరీలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు.  ఆమె చుట్టూనే కథ నడుస్తుంది.  కథకు అనుగుణంగా హీరో కోసం అనేక మందిని తేజా సంప్రదించారట.  కథ బాగుందిగాని కాజల్ చేస్తోంది అనే సరికి హీరోలు పక్కకు తప్పుకున్నారట.  దీంతో చివరకు కాజల్ తో కవచం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ సీతలో హీరోగా చేస్తున్నాడు.