డైరెక్టర్స్.. వెంకీ విషయంలో జర జాగ్రత్త !

 డైరెక్టర్స్.. వెంకీ విషయంలో జర జాగ్రత్త !

కొన్నేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న వెంకీ 'ఎఫ్ 2' విజయంతో ఒక్కసారి బాక్సాఫీస్ మీద విరుచుకుపడ్డాడు.  చాన్నాళ్లుగా ప్రేక్షకులు మిస్సైన తనలోని కామెడీని పూర్తిస్థాయిలో పరిచయం చేసి విపరీతంగా నివ్వించేస్తున్నాడు.  సినిమా చూసిన జనమంతా ఇకపై కూడా వెంకీ సినిమాలు ఇలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారు.  ఇంకొందరైతే ఇలాగే ఉండాలని నియమం పెట్టేస్తున్నారు. 

వెంకీ కోసం కథలు తయారుచేసుకున్న దర్శకులు ఎవరైనా సరే ఏదో ఆషామాషీ కథల్లో, నామమాత్రపు కామెడీ ట్రాకుల్లో ఆయన్ను ఇరికించేసి సినిమా నడిపేద్దాం అనుకుంటే పొరపాటే.  ఇకపై ఆయన ప్రతి సినిమాను 'ఎఫ్ 2'తో పోల్చి చూస్తారు ప్రేక్షకులు.  కనుక కథలు రాసేవాళ్ళు అందులోనూ ప్రత్యేకంగా ఫన్ జానర్లో రాసుకునేవాళ్ళు జర జాగ్రత్తగా రాయడం మంచిది.