నిరాశపరిచిన 'ఆదిపురుష్' యూనిట్

నిరాశపరిచిన 'ఆదిపురుష్' యూనిట్

బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 7.11నిమిషాలకు 'ఆదిపురుష్‌' నుంచి అప్ డేట్ వస్తుందని ప్రకటించింది యూనిట్. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ రావకపోవడంతో నిరాశకు గురయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న 'ఆదిపురుష్' రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ చిత్రం భారీ బజ్ క్రియేట్ చేసింది. శ్రీరామనవమి పర్వదినాన వచ్చే స్పెషల్ అప్డేట్ ఏమిటా అని ఆశగా ఎదురు చూసిన ప్రభాస్ తీవ్రంగా నిరాశకు గురయ్యారనే చెప్పాలి. అసలు అప్టేడ్ వస్తుందా? రాదా? అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. మరి సాయంత్రం లోపైనా వస్తుందా? లేక మొత్తానికే స్కిప్ చేస్తున్నారో తెలియరాలేదు. ఈ చిత్రంలో రావణునిగా సైఫ్ ఆలీఖాన్, లక్ష్మణుని పాత్రలో సన్నీ సింగ్ 
కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగష్టు 11న విడుదల చేయాలని భావిస్తున్నారు.